Skip to main content

is it true


ఎంత వెటకారం అయిపోయింది.. ప్రతి ఒక్కడికి లోకువగానే ఉంది. కనిపించినంత సులువుకాదు.. సుఖమూ..లేదు.. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే

మధ్య ప్రతి ఒక్కడికి సులువుగా ఉద్యోగాలు రావడంవలన అనుకుంట ఫీల్డ్ అంటే లోకువ కట్టేసారు.. వైట్ కాలర్ జాబ్.. సుఖంగా కూర్చీలోంచి కదలకుండా.. చాటింగ్ చేసుకుంటూ.. పాటలు వింటూ.. ఎంజాయ్ చేస్తూ.. వారానికి రొండు రోజులు సెలవు తీసుకుంటూ.. పని తక్కువ పైసలు ఎక్కువ .. ఇవే తెలిసినవి పైకి.. తెలియని విషయాలు చాలా ఉన్నాయి

ఏసీలో చెమటలుకుర్చీలో అయస్కాంతాలుపియల్ చేత అక్షింతలు.. మీటింగుల్లో ఒకరిపైఒకరి నీలాపనిందలు.. అమ్మో.. బాబోయ్ అని మనసులోనే అనుకుంటూపైకి నవ్వుతూ నటనలు చేయటాలు.. ఏం చెప్పమంటారు.. అది చెబితే తెలియదులేండి అనుభవించాలి

ఒకోరోజు.. ప్రక్కసీటులోవాడు వచ్చాడోలేదో తెలియకుండా పనిచేయాల్సొస్తుంది.. అంటే మీరే అర్ధంచేసుకోండి.. అన్ని ఉద్యోగాలు అలానే ఉంటాయి కాదనటంలేదు..

కానీ ఫీల్డ్ కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే..

ఉంటే.... చాటింగ్ చేసుకుంటూక్యాంటిన్ లో పౌడర్ టీలు అవసరంఉన్నా లేకున్నా తాగుతూ.. కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకునెంత టైముంటుంది

లేకపోతే.. పెళ్ళాం ముద్దుగా ఫోన్ చేసినా చిరాకుగా మాట్లాడేంత పనుంటుంది.. అది ఎప్పుడు ఎలా వచ్చిపడుతుందో ఎవడికీ తెలియదు. అదే అసలు సమస్య.

ఎంతో కష్టపడి.. సాధించాం అనుకున్న పని.. మన పైన ఉన్నవాడికి డెమోనో లేక సబ్మిట్ చేద్దామనో అనుకున్నప్పుడు.. సడెన్ గా మొరాయించడం మొదలవుతుంది.. దాన్నే బగ్ అనో.. గిగ్ అనో.. మా ప్రోజెక్ట్ లీడర్ అయిరన్ లెగ్.. అనో ఏదనుకున్నా కానీ.... ఒకొక్కసారి. చేసినదంతా వేస్ట్ అన్నట్లు ప్రోజక్ట్ లీడర్.. మొహంమీద.. కరాకండిగా చెప్పేస్తాడు ఇంత సులువుది కూడా ఇంత టైం తీసుకుంటున్నావేంటి అని ఇన్ డైరెక్టుగా అడుగుతాడు.. ఇక ఒక్కసారే మీటర్ 200 దాటిపోద్ది.. పోరా.. నీకు తెలియనిదా.. ఇది.. నేనంతా కరెక్ట్ గానే చేసాను.. అది ఇష్యూలో చిక్కుకుంది నేనేంచేయను. నా సీట్లో కూర్చుంటేగాని తెలియదు.. చేసేముందు నాకూ ఈజినే అనిపిస్తుంది.. కాని అనుకోని సమస్యల్లో చిక్కుకుని.. ఇలా అయ్యింది.. ఒక్కసారి చేసిచూడు తెలుస్తుంది.. అని మనసులోఅనుకుని.. కాస్త చిరాకు పరాకు చూపులు చూసే సరికి వాడికే అర్ధం అవుతుంది..

అదికాదమ్మా.. ఇది నీ ప్రాబ్లమ్ కాదులే.. నువ్వు చెయ్యాలని చెయ్యలేదనుకో కాని.. ఇప్పుడు డెలివరి టైం లో ఇలా వస్తే నామీద ఎగిరి పడతారు.. అందరూ.. ఇప్పుడెలా.. అని బిక్కమొహం వేస్తాడు... ప్రోజక్ట్ లీడరు..

సరేలేండి ఐవిల్ గూగుల్ ఇట్ అవుట్…(గూగుల్ లో వెతికి చూస్తాను) అది నోన్ ఇష్యూ అయితే.. ఫోరమ్స్ లో సొల్యూషన్ దొరక్కపోదు.. లేకపోతే కొన్నిరోజులు వెయిట్ చేయాలి.. అని.. కాస్త కుదుట పడి..

మళ్ళా.. అలో.. సాఫ్ట్వేర్.. ఇంజనీర్.. అనుకుంటూ.. మొహాన్నీ మానిటర్ కి వేళాడదీసుకోవాల్సొస్తుంది. లోపుగా.. ఎవడో టైముబాగోక మెయిలో.. లేక ఫోనో చేస్తాడు.. అంతే వాడికి మూడింది.. ఎరా.. ఏం పీకుతున్నవ్ బే.. మధ్య ఫోన్ చేయటంలేదు.. పోరీని పట్టావేంటి.. అంటాడు.. నేను సాయంత్రం చేస్తారా.. అని ఎక్కిన మీటర్ ని.. దించి.. కళ్ళుమూసుకుని.. కూల్ గా చెబుతాను .. విన్నాడా బ్రతికిపోతాడు. లేకపోతే అయిపోతాడు..

మళ్ళీ వర్క్.. ఈలోపు.. కాళీగా తిరిగే ప్రక్క ప్రాజెక్ట్ వాళ్ళ వెటకారాలు.. (మనం ఖాలిగా ఉన్నప్పుడు తగ్గుతామా.. ఏంటి.. మనమూ ఇలా సెటైర్లేస్తాం.. అందుకే వీళ్ళ రివెంజ్ ఇప్పుడు.)

మనోడు కుమ్మేస్తున్నాడురో.. హైకుల టైముకదా.. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ కోసమేమో, లేదా ఆన్ సైట్ ఆఫర్ కోసమో.. సీరియస్ గా చేస్తున్నాడు.. అని సెటైర్లు వేయటం..

ఒరే.. పనీలేదు పాటూలేదు.. మెడకో లాప్ టాప్ అని..

ఇక్కడ పని అవక నేను చస్తుంటే.. ఆన్ సైట్ ఆఫర్ ఒకటిఅనేలోపే.. వాళ్ళు తప్పించుకుని నవ్వుతూ పారిపోయారు..
సడెన్ గా ఎదో.. మనకు దగ్గరగా ఉన్నటువంటి సమస్యే.. ఎవడో ఫోరమ్లో కనిపిస్తుంది.. కళ్ళింతచేసి మొహం మానిటర్లోపెట్టి వెతికినంతసేపుండదు.. దానికి ప్రశ్న ఉంది కానీ జవాబు ఎవరూ ఇవ్వలేదు....

ఛీ.. నీ.. కొంచెంలో పోయిందిరా.. అనుకుని.. వీడు ఎవడో మనలాంటి బాద్యుడే.. అనుకుని.. మళ్ళీ.. వెతుకులాట.

అంతే ఈలోపు.. డెస్క్ పై ఉన్న ఫోను మ్రోగడం మొదలుపెడుతుంది.. నాకు తెలియనంత ధీక్షగా వెతుకుతున్నానేమో.. అప్పటికే పది రింగులై ఉంటాయి.. మొద్దుబారిన మెదడుకు ఎదో మ్రోగుతున్నదని.. అనిపించి.. లిఫ్ట్ చేసానా.. సార్... వి ఆర్ ఫ్రమ్.. సో అండ్ సో బ్యాంకు మీరు ఇప్పుడు ప్రస్తుతం క్రెడిట్ కార్డు వాడుతున్నారు.. సార్.. అని శ్రావ్యంగా.. వినపడిందొక ఆడగొంతు.

నీకు బుద్దుందా.. నేనేది వాడితే నీకెందుకే.. పెట్టు ఫోను.. మళ్ళీ చేసావంటే.. నిన్ను.. నిన్ను.. ఛా.. అని.. టక్ మని.. ఫోన్ పెట్టేసాకా అనిపిస్తుంది.. పాపం టాస్క్ మీద కోపానికి అమ్మాయి భలి.. లేకపోతే నేను ఖాళీగా ఉన్నప్పుడు చేస్తే కాసేపు కాలక్షేపానికి సుత్తికొట్టేవాడిని కదా.. ఇలాంటి టైములో ఏంటి.. అని అనుకుని.. సరేలే.. అమ్మాయి టైము బ్యాడ్.. కష్టమైన టాస్క్ చెయ్యలేని.. ఎవడో ఎదవ.. కష్టమర్.. అని లైట్ తీసుకుంటుందిలే...


ఆమ్మా.. గూగులమ్మతల్లీ.. బ్రహ్మీ సాప్ట్వేర్ ఇంజనీరుకు.. సొల్యూషన్ వరాలిచ్చి కరుణించమ్మా.. ..

త్వమేవ మాతాచ పితాత్వమేవ.. త్వమేవ భందు సఖాత్వమేవ….. త్వమేవ సర్వం మమదేవదేవాఅని పెద్ద శ్లోకం చదివి.... హారతిచ్చి.. కొబ్బరికాయ కొట్టినట్లు.. మళ్ళీ.. వెతుకు.. బటన్ కొట్టాను. గూగుల్ లో..

లోపు.. నాలుగుసార్లు ప్రోజక్ట్ లీడర్ వెనుకనుండి తొంగిచూసి వెళ్ళాడు..

ఆయన టెన్సన్ ఆయనది.. అసలు దొరుకుతుందో లేదో అని నాకు టెన్సనైతే.. ఏమో అసలు అవుతుందో లేదో అని.. (అతని చేతిలో లేదు కదా) అతని టెన్సన్..

మళ్ళీ ఏసీలో చెమటలు.. కాసేపటికి ఒక కొలిక్కి వచ్చింది.. అనిపించింది.. ఎదో పాత గుడ్డకి పాత దారం వేసి కుట్టిన.. అతుకుల బొంత లాగా

టైముచూసేటప్పటికి..

Comments

Popular posts from this blog

Find Serial Number of your Mobile

Press * # 06 # in ur mobile. You will be getting a 15 digit serial number of ur mobile. Keep this number safely. In case, if ur mobile is lost or stolen, you can track it using this serial number, even if the stolen person changes the sim card. Plz pass this message to all ur friends so that we can avoid mobile theft.......